ఏపీ నిరుద్యోగులకు మళ్లీ గుడ్ న్యూస్.. ఈసారి 8,400 పోస్టులు..!
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటినీ ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఇటీవల సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలన్నారు
ఇటీవలే ఏపీలో 15,926 నియామకాలకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్దం చేస్తోందంటూ ఓ వార్త వచ్చింది. వీటితో పాటు 402 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన వెలువడనుందని ఆ వార్త చెప్పింది. అసలు ఏపీలో మొత్తం 16వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ముందు బ్యాక్ లాగ్ పోస్టులైన 402 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి మినీ డీఎస్సీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మినీ డీఎస్సీ తర్వాత 15,926 నియామకాలకు డీఎస్సీ వేస్తారని తెలుస్తోంది.
డీఎస్సీతో పాటే టెట్‌నూ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉండడంతో డీఎస్సీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల హేతుబద్దీకరణ, బదిలీల తర్వాత ఖాళీల అంచనాపై ఓ అవగాహనకు వచ్చారు. అయితే మొత్తం 16 వేలకు పైగా ఖాళీలు ఉన్నా.. ఆర్థికశాఖ ఎన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. డీఎస్సీ, సచివాలయ ఉద్యోగాలు.. ఇలా ఏదో ఒక నోటిఫికేషన్ అంటూ వస్తుంటే నిరుద్యోగులు కాస్త సంతోష పడతారు. తమ శక్తి మేరకు ఏదో ఒక ఉద్యోగం సంపాదించు కునే ప్రయత్నం చేస్తారు.