
వార్మ్ విషెష్, బ్లాక్ మెయిల్, నీచులు.. ఈ పదాలు అస్సలు వాడొద్దు?
ఈ నేపథ్యంలోనుంచే warm wishes అనేది వచ్చింది. అది దిగుమతి భాష కాబట్టి మనం దానిని యథాతదంగా వాడేస్తున్నాం. అలాగే మనం ఉష్ణమండలంలో ఉన్నాం కనుక మనం చల్లదనాన్ని కోరుకుంటాం. అందుకే, ఎవరైనా ఒక మంచిమాట, సంతోషం కలిగించే విషయం చెప్పారనుకోండి. "ఎంత చల్లనిమాట చెప్పారు" అని ఆనందపడుతుంటాం. అలాగే.. "నీ కడుపు సల్లగుండా" అని అంటూంటాం. అలాగే జాతి వివక్ష, కుల వివక్ష నుంచి కూడా కొన్ని పదాలు పుట్టాయి. తాము చిన్నచూపు చూసేవారికి అపాదించి కొన్ని తిట్లను వారి రంగును బట్టి, కులాన్ని బట్టి తిడుతుంటారు. ఉదాహరణకు... తెల్లవారికి నల్లవారంటే గిట్టదు.. అందులోంచి పుట్టినవే... బ్లాక్ మెయిల్, బ్లాక్ మార్కెట్ అనే పదాలు. మనం వాటిని అలాగే వాడేస్తున్నాం.
అలాగే మన ప్రాంతంలో కొందరు కొన్ని ఆహార పదార్థాలను తినరు. అయితే, వాటిని తినేవారంటే వారికి అసహ్యం. అందులోంచి పుట్టిందే... "నీచులు" అనే పదం. నీచులంటే.. నీసు తినేవారని అర్థం. అంటే.. నాన్ వెజ్ వారని. అలాగే.. కోపమొస్తే... మన అమ్మనో, సోదరినో, భార్యనో ఉద్దేశించి తిడుతుంటారు. పురుషులకు ఆడవారు అంటే చిన్నచూపు కదా.. అందుకే! ఆధిపత్యవర్గాలు, కులాలు, ప్రాంతవాసులు తమ కంటే తెలివిలో, రంగులో, బలంలో తక్కువ ఉన్నవారిని ఉద్దేశించి ఇలాంటి భాష, మాటలు వాడుతుంటారు.. అందులోంచే ఇవి పుట్టాయి.. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. భాషాశాస్త్ర వేత్తలు ఇంకా వీటి మీద శోధిస్తూనే ఉన్నారు. అందుకే ఓ పదం వాడే ముందు దాని పుట్టుక గురించి ఓ క్షణం ఆలోచించండి. ఏమంటారు.