దారుణం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

Suma Kallamadi
సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. మానవత్వ విలువలు మర్చిపోయి రాక్షసుల జీవనం సాగుతున్నారు. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. ఇక చిన్న చిన్న కారణాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. దీంతో రోజురోజుకి సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తెలిసి తెలియని వయస్సులోనే చిన్న పిల్లలు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇక కొంత మంది మానవత్వం ఉన్న మనుషులు అందరూ ఉన్మాదులుగా మారి దారుణ హత్యకు పాల్పడిన ఘటనలు  ఎన్నో తెర మీదికి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి, సాటి మనుషులకు ప్రాణాలను జాలి దయ అనేది లేకుండా మానవత్వం మరిచి నిర్ధాక్షణ్యంగా గాల్లో కలిపేస్తున్నారు ఎంతోమంది. చిన్న చిన్న కారణాలతోనే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని చివరికి ఎంతో విలువైన ప్రాణాలను తీసేస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. జిల్లాలోని గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామకృష్ణ(43), అతని భార్య రాజేశ్వరి(38), వారి కుమారుడు(14)గా గుర్తించారు. రాత్రి పూట విష గుళికలు మింగి వీరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఉదయం స్థానికకులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో ఎర్రగుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. అయితే వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: