7 రూ.లతో వంద కిలోమీటర్లు ప్రయాణించండి.. మీ కోసమే అదిరిపోయే ఆఫర్..?

praveen
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. ఇక ఇప్పుడు అటు పెట్రోల్ ధరలు కూడా ఆకాశాన్నంటడంతో  ఇక ఇప్పుడు మరింత ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీసేందుకు ధైర్యం చేయడం లేదు సామాన్య ప్రజలు.



 పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు జనాలు. అదే సమయంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కి కూడా అంతకంతకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి.  అయితే ఇటీవల హైదరాబాద్కు చెందిన ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు ఆటమ్ 1.0. ఇక ఈ బైక్ డ్రైవింగ్ రేంజ్ 100 కిలోమీటర్లు. అయితే వంద కిలోమీటర్లు ప్రయాణించడానికి మీరు కేవలం ఏడు రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుంది.



 ఏంటి ఆశ్చర్య పోతున్నారు కదా.. మీరు విన్నది నిజమే. ఆటమ్ 1.0 బైక్ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అంతేకాదు ఈ బైక్ కి వచ్చిన బ్యాటరీ కి రెండేళ్ల వరకు గ్యారెంటీ ఉంటుంది. కేవలం ఏడు లేదా ఎనిమిది రూపాయలు వెచ్చిస్తే చాలు బ్యాటరీ ఛార్జ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ బైక్ ధర 50 వేల రూపాయలు గా ఉంది. ఇక ఈ ఎలక్ట్రికల్ బైక్ లో డిజిటల్ డిస్ ప్లే , కంఫర్టబుల్ సీటు, ఎల్ఈడీ హెడలైట్,ఇండికేటర్స్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మీకు ఈ బైక్ కావాలి అంటే కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: