కామంతో ఊగిపోయిన వాలంటీర్.. బాలిక ఒంటరిగా ఉండడంతో.. చివరికి..?

praveen
మహిళల పై రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సభ్య సమాజంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు  చూస్తుంటే సృష్టికి మూలమైన ఆడ పిల్లలు అడుగడుగునా కామాంధుల కోరల్లో చిక్కుకోవలసి వస్తుంది అన్నది అర్ధమవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా రెచ్చి పోతున్న కామాంధులు మహిళల పై దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో  అడుగడుగున ఆడపిల్ల ప్రశ్నార్థక జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే మహిళలకు రక్షణ కల్పించడానికి ఇక మహిళల పై అత్యాచారాలకు పాల్పడే కీచకులకు కఠిన శిక్షలు విధించేందుకు కఠిన చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కామం తో ఊగిపోయి  అభం శుభం తెలియని ఆడపిల్లలపై దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  ఇటీవలే ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది.  వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాల్సింది  పోయి ఏకంగా ఒక బాలిక పై కన్నేశాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవంతం గా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.



 ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరు లో చోటు చేసుకుంది. ఏడవ తరగతి చదువుతున్న బాలిక ఒంటరిగా ఉంది. తల్లిదండ్రులు పని నిమిత్తం పొలానికి వెళ్లడంతో బాలిక  ఒంటరిగా  ఉన్న విషయాన్ని గ్రామ వాలంటీర్ గమనించాడు.  ఈ క్రమంలోనే గ్రామ వాలంటీర్ రమేష్ కామం తో ఊగిపోయాడు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఏకంగా ఇంట్లోకి వెళ్లి బాలికను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: