పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?
ఇదంతా ఇలా ఉంటే గడిచిన సోమవారం రోజున కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బంగీ అనంతయ్య వైసీపీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. అనంతయ్య 1995వ సంవత్సరం నుంచి 2000 వరకు కర్నూలు మేయర్‌గా పనిచేశారు. ఈయన టీడీపీ కి చెందిన నాయకుడు కావడం విశేషం. అయితే ఈయనతో పాటుగా టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సురేష్, రవిశంకర్, గణేష్, రఘు రాణా ప్రతాప్, శంకర్, చిరంజీవి సహా దాదాపు వంద మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. బంగీ అనంతయ్య వైసీపీలోకి చేరే ముందు, చేరడానికి గల కారణాలను ఈ విధంగా చెప్పడం జరిగింది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అది చేస్తాం, ఇది చేస్తాం అని కాలయాపన చేశారు. దేనేయితో కర్నూలు ప్రజలు చంద్రబాబు పాలనతో విసుగెత్తిపోయారు.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నారు. ఈయన పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కర్నూలుతో పాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. దీనితో కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతే కాకుండా కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి నగరంలో ఉన్న సమస్యలన్నింటినీ క్రోడీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు కర్నూలు పర్యటనలో ప్రజలు సరిగా స్పందించలేదు. దీనితో కర్నూలు మేయర్ గా వైసీపీ అభ్యర్థి గెలవడం దాదాపు ఖాయంగా అనిపిస్తోంది.