హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా.. ఇలా చెక్ పెట్టండి..?
చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఇలా జుట్టు రాలే సమస్య వేధిస్తుంది. కొంతమందిలో అయితే కనీస వయస్సు కూడా రాకుండానే ఏకంగా జుట్టు మొత్తం రాలిపోయి బట్టతల వస్తూ ఉండటంతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యువకులు. సాధారణంగా ఎక్కువగా అందంగా కనిపించాలంటే వివిధ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఇలా హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలి అంటే ముందు జుట్టు ఉండాలి కదా అనుకుంటున్నారు మరికొంతమంది. అంతలా ఎంతో మందిని వేధిస్తోంది హెయిర్ ఫాల్ సమస్య.
జుట్టును ఆరోగ్యంగా పటిష్టంగా మార్చుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు పాటించాలి అని సూచిస్తున్నారు నిపుణులు. జుట్టు అందంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు మాంసం అన్ని కూడా అందించాలని చెబుతున్నారు. మాంసం చేపలు నట్స్ లాంటివి కూడా డైట్ లో చేర్చుకోవడం మంచిది అని అంటున్నారు. బయటికి వెళ్ళినప్పుడు జుట్టుకు దుమ్ము ధూళి నుంచి రక్షణ కల్పించడానికి స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోవడం లాంటివి చేస్తే బెటర్. ఒత్తిడి జుట్టు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి లేకుండా చూసుకుంటే జుట్టు రాలే సమస్య కూడా చెక్ పెట్టవచ్చు. ఇక స్మోకింగ్ చేయడం వల్ల జుట్టు డి ఎన్ ఎస్ ను ఎంతో నాశనం చేస్తుంది ఈ క్రమంలోనే జుట్టు రాలే సమస్య పెరిగిపోతుంది.