జనసేనకు ఇదే కీలక సమయం.. జనసైనికులు నిలబడితే.. ఫ్యూచర్ అద్భుతం..?
అయితే ఇక రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ మొదటి నుంచి విఫలమవుతూనే వస్తుంది. అయితే ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధైర్యంగా నిలబడి పోరాడటంతో ఇప్పుడిప్పుడే ప్రజలందరిలో కూడా జనసేన పై నమ్మకం వస్తుంది. ఈ క్రమంలోనే ప్రజలందరూ జనసేనకు ఓటు వేసి గెలిపించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక అదే సమయంలో రాజకీయ పార్టీలు ఎక్కువగా గెలవడానికి రాజకీయంగా బలం గా మారడానికి కూడా కొన్ని రకాల సామాజిక వర్గాల సపోర్ట్ అవసరం అన్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన వెంటే ఉంటుంది.. ఈ క్రమంలోనే జనసైనికులు అందరూ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నిలబడుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జనసైనికులు ఇలాగే నిలబడితే రానున్న రోజుల్లో పార్టీ పై ప్రజల్లో నమ్మకం వచ్చి పార్టీ మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి వరుసగా ఓటమిని చవి చూస్తూ వచ్చిన జనసేన పార్టీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా గోదావరి జిల్లా లో ఎవరూ ఊహించని విధంగా అధికార వైసిపి ప్రతిపక్ష టీడీపీ పార్టీకి కూడా షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. మరి క్లిష్ట పరిస్థితుల్లో జనసైనికులు ఎన్ని రోజుల పాటు కలబడి నిలబడతారు అన్నది చూడాలి మరి.