పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే.. ఇన్ని లాభాలా.. తప్పక తెలుసుకోండి..?

praveen
ఈ మధ్య కాలం లో అందరూ కూడా ఆరోగ్యాన్ని పదిలం గా  ఉంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే వంటింటి చిట్కాలు తోనే  ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకో వచ్చు అని తెలియక ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యం గా ఉల్లి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు.  ఉల్లి తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో  అటు వెల్లుల్లి తినడం వల్ల కూడా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు.



 వెల్లుల్లి తింటే గుండె పోటు ముప్పును తగ్గిస్తుందట. అంతే కాకుండా వెల్లుల్లి  ఉత్పత్తి చేసే ఫైబ్రినోలైసిస్ గడ్డకట్టిన రక్తాన్ని కూడా సాధారణ స్థితికి తీసుకు వచ్చే అవకాశం ఉందట. అందుకే డయాబెటిస్ రోగులు తరచుగా వెల్లుల్లి తీసుకోవడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. ఇలా రక్తాన్ని గడ్డ కట్టడాన్ని నివారణ వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం కూడా తగ్గిపోతుంది. ఇక డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల రక్తం చిక్కగా మారుతుంది కాబట్టి వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు.



 రోజు ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొవ్వు స్థాయి కూడా తగ్గడం వల్ల గుండెపోటు ముప్పు మధుమేహం సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండేందుకు అవకాశం ఉంటుందట. అంతేకాదు వెల్లుల్లి ఔషధ గుణాల వల్ల జలుబు, ఫ్లూ,జ్వరం, అధికరక్తపోటు, గుండెపోటు, మధుమేహం, ప్రయాణాలలో  విరేచనాలు.. లాంటి ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. పెద్ద పేగు, పురీష నాళం, జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ లను కూడా నిరోధించడంలో వెల్లుల్లి ముఖ్యపాత్ర వహిస్తుందని చెబుతున్నారు. అయితే ఉదయం పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: