పాక్‌ చెంప చెళ్లుమనిపించిన.. భారత కుర్ర ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి..?

Chakravarthi Kalyan
మిరపకాయ్ ఎంత ఉంటుంది.. చిన్నదే అయినా కొరికితే మంట నషాళానికి అంటాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువ ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి కూడా అంతే.. సర్వీసులో చేరి ఐదారేళ్లు కూడా పూర్తి కాకుండానే.. అంతర్జాతీయ వేదికలపై తన ప్రసంగంతో అదరొగట్టేసిందీ యువతి. అంతే కాదు.. మన ప్రత్యర్తి పాకిస్తాన్‌  ఐక్యరాజ్యసమితిలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఇప్పుడు ఈ యువ అధికారికి దేశమంతా జేజేలు పలుకుతోంది.

అసలు ఎవరీమె..ఎలా వెలుగులోకి వచ్చింది.. తెలుసుకుందాం.. ఆమె పేరు  సీమా. 2014 సివిల్స్‌లో ఆలిండియా ర్యాంకర్‌ ఆమె. 34వ ర్యాంకు సాధించి, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసును ఎంచుకున్నారు. సీమ హర్యానా అమ్మాయి. ఫరీదాబాద్‌లో పుట్టింది. ఇంట్లో తనే చిన్న. మిగతా ఇద్దరూ అక్కలు. తండ్రి అమర్‌నాథ్‌ పూజానీ రిటైర్డ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌. తల్లి గృహిణి. సీమ  ఇంటర్‌ తర్వాత లా’ వైపు వెళ్లిపోయారు. బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌లో చదివారు. అప్పుడే విస్తృతంగా సామాజిక అంశాల అధ్యయనం చేశారు. దాంతో సివిల్స్‌ వైపు వెళ్లాలన్న ఆలోచన కలిగింది.

రెండో అటెంప్ట్‌తో సివిల్స్ కల నెరవేర్చుకున్న ఆమె ఐఎఫ్‌ఎస్‌లో చేరారు. మొన్న జెనీవాలో మానవ హక్కుల మండలి సమావేశంలో అత్యంత కీలకమైన సమావేశంలో ఆమె గట్టిగా పాక్‌కు బదులిచ్చారు. పాకిస్తాన్‌ ఎప్పటిలాగానే  జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం గురించి, స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం మొదలు పెట్టగానే... ఆమెను కొద్దిసేపు మాట్లాడనిచ్చి మన దౌత్య అధికారి సీమా పూజా ఘాటుగా సమాధానమిచ్చారు.

పాకిస్తాన్‌ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతోందీ... భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికల్ని ఎలా వాడుకుంటోందో  సీమా డిటైయిల్డ్‌ గా అన్ని దేశాలకూ అర్థమయ్యేలా చెప్పారు. ఈ యువ ఐఎఫ్‌ఎస్‌ ఇచ్చిన  సమాధానానికి ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఒసే పాకిస్తాన్.. ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’.. అని చెప్పేసింది సీమా.  సీమా సమాధానం చూసి  భారత్‌ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు  శెభాష్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: