కేవలం 20 రూ.లకే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం..?
అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాలి అంటే నెలకు 129 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎవరికైనా ఇదే తరహా ధర చెల్లించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం 20 రూపాయలకే అమెజాన్ ప్రైమ్ పొందవచ్చు ఎలా అని అంటారా.. 20 రూపాయలు చెల్లిస్తే ఓటీపీ చెబుతాం అమెజాన్ ప్రైమ్ లాగిన్ అయి ఆనందించండి అంటూ కొంతమంది ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఈ ప్రచారం చేసే వారు ఎవరు అని అంటారా ఇంకెవరు.. ప్రజలందరినీ ఎప్పుడెప్పుడు బురిడీ కొట్టించి డబ్బులు దండుకుందామా అని ఎదురుచూసే కేటుగాళ్లు.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ఇలాంటి తరహా మెసేజ్ పంపిస్తుండంతో వీరి ప్రకటనలు చూసి వందల సంఖ్యలో యువకులు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే ఇక వారు చెప్పిన విధంగా20 రూపాయలు చెల్లించి ఓటీపీ లు తీసుకుంటున్నారు. అయితే ఇటీవలే ఓ యువతిని వేధించిన కేసులో నిందితుడిని విచారిస్తున్న క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు అతని ఫోన్ నెంబర్ ని పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక ఈ సమాచారంతో దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దాని పై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.