ఆ రెండు రాష్ట్రాలు దేశాన్నే భయపెడుతున్నాయి.. ఎందుకో తెలుసా..?

praveen
చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ భారత దేశాన్ని అతలాకుతలం ఎంతలా  అతలాకుతలం చేసిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పై పంజా విసిరింది ఈ మహమ్మారి. సామాన్యులు సెలబ్రిటీల అనే తారతమ్యం లేకుండా అందరిని బెంబేలెత్తించింది.  ఈ క్రమంలోనే వేల సంఖ్యలో ఈ  మహమ్మారి వైరస్ బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోయారు అన్న విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్  విధించి  కఠిన ఆంక్షలు  అమల్లోకి తెచ్చినప్పటికీ ఏకంగా లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం.



 అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా కరోనా  వైరస్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో కరోనా  వైరస్ కేసులు కంట్రోల్ కాకపోవడంతో ప్రజలందరూ బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం అతి ఎక్కువ కరోనా  వైరస్ కేసులు నమోదు అవుతున్న  రాష్ట్రాల్లో మహారాష్ట్ర కేరళ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా కేరళ మొదట్లో కరోనా వైరస్ నియంత్రించడంలో విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మాత్రం  పూర్తిగా విఫలం అయింది. ఇక మహారాష్ట్రలో మొదటి నుంచి భారీగా కేసులు నమోదు కాగా.. ఇక మొన్నటి వరకు అతి తక్కువ కేసులు నమోదయ్యాయి.



 కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.రెండు రాష్ట్రాలు  దేశం మొత్తాన్ని భయపెడుతున్నాయి. మరోసారి ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా శరవేగంగా పాకి  పోతూ ఉండడంతో ఇక వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా భయపడి పోతున్నారు.  దేశం మొత్తంలో వెలుగులోకి వస్తున్న కొత్త కేసులలో  70 శాతం కేసులు  కేవలం రెండు రాష్ట్రాల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇలా ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడానికి గల కారణం ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం అధ్యయనాలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: