మూడేళ్ళ తర్వాత తిరిగిచ్చిన భర్త.. గర్భంతో ఎదురుపడిన భార్య.. చివరికి..?

praveen
అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో భర్త మోసం చేస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో భార్య మోసం చేస్తుంది. భర్తను నమ్మి వచ్చిన భార్య మోసపోతుంటే.. నమ్మిన భర్తను భార్య మోసం చేస్తుంది. శారీరక సుఖం కోసం.. తప్పటడుగులు వేస్తున్నారు. ఇటూ భర్త చేత మోసపోయిన భార్యలను చూస్తున్నాం. అటూ భార్య చేత మోసపోతున్న భర్తను చూస్తున్నాం. ఇలాంటి వార్తలు రోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని మారిన వారి సంఖ్య చాలా తక్కువే. కష్టాలను ఏరికోరి తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ ‌కు చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం మూడేళ్ల కిందట గల్ఫ్‌ కు వెళ్లాడు. వారం రోజుల కిందట స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చి రాగానే భార్య కడుపునొప్పితో బాధ పడుతోంది. అది చూసిన భర్త.. భార్యను తీసుకెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యానికి జాయిన్ చేయించాడు. వైద్యం నిర్వహించిన డాక్టర్లు ఆమెకు ఐదు నెలల గర్భవతిగా నిర్ధారించారు.

వైద్యులు ఈ వార్త చెప్పగానే భర్త ఒక్కసారిగా షాక్‌ కి గురయ్యాడు. దీంతో భర్త.. ‘‘నేను మూడేళ్లు ఇంటి దగ్గర లేను.. నీకు ఐదు నెలల గర్భం ఏలా వచ్చింది.’’ అని అతడు భార్యను నిలదీశాడు. అయితే గత కొంతకాలంగా గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి బెదరించి లొంగదీసుకున్నాడని చెప్పుకొచ్చింది. అలా గర్భవతిని అయ్యాయని.. గర్భం తొలగిస్తానని చెప్పినప్పుడు.. నీ భర్తను చంపేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. దీంతో భర్త పోలీసులను ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమన్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: