భర్తకు విషం ఇచ్చిన గర్భవతి భార్య.. కారణం తెలిసి షాకైన పోలీసులు..?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చింది భార్య. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంతో ఎంతోమంది కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చిన సంఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రియుడి మోజులో పడి ఏకంగా కట్టుకున్న భర్త అడ్డు తొలగించుకుంటున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. శారీరక సుఖం కావాలిఅంటూ భార్యను వేధించడం మొదలు పెట్టిన భర్త తీరుతో విసిగి పోయిన భార్య చివరికి భర్త ను హతమార్చాలని అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అన్నంలో విషం కలిపి భర్తను హతమార్చింది.
ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. అందియూర్ నందన్ కుమార్ తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితేప్రస్తుతం నందన్ కుమార్ భార్య గర్భవతి. ఇకపోతే ఇటీవలే విషాహారం తిని తీవ్రమైన కడుపునొప్పి విరేచనాలతో బాధపడినా నందన్ కుమార్ వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు నందన్ కుమార్. అయితే విషప్రయోగం కారణంగానే నందన్ కుమార్ మరణించాడు అని తేల్చారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. గర్భంతో ఉన్నప్పుడు తరచు కోరిక తీర్చాలి అంటు వేధించేవాడని అందుకే అన్నంలో విషం కలిపి భర్తను హత్య చేశా అంటూ పోలీసుల ముందు నేరం అంగీకరించింది భార్య మైథిలి.