బ్రాహ్మణ ఘోష : ప్రతి బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యకికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి...

Purushottham Vinay
బ్రాహ్మణులకి ఒక అద్భుతమైన చరిత్ర వుంది. ఒక దేవునికి  భక్తునికి మధ్య వారధి అంటే బ్రాహ్మణుడు మాత్రమే. అందుకే బ్రాహ్మణులను సమాజంలో అందరూ గౌరవిస్తారు. వారి విధానాలు, ఆచారాలు అన్ని ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఏదైనా వారు ఒక పని మొదలు పెడుతున్నారంటే దాని వెనకాల చాలా అర్ధం దాగి ఉంటుంది.హిందూ ఆధ్యాత్మిక ధ‌ర్మంలో ఏం చేయాల‌న్నా.. బ్రాహ్మ‌ణులు చేయాల్సిందే. మ‌ఠాలైనా.. ఆశ్ర‌మాలైనా.. పీఠాలైనా.. కూడా ఆధ్యాత్మిక రంగంలో బ్రాహ్మ‌ణుల‌దే పెద్ద‌పీట‌. భగవంతునికి నైవేద్యం పెట్టాలన్న భక్తునికి ప్రసాదం పెట్టాలన్న గుడికి వచ్చే ప్రతి పేదవాడికి కడుపు నిండేలా అన్నదానం చెయ్యాలన్న అందులో బ్రాహ్మణుల  పాత్రలు, హస్తాలు  వుండాల్సిందే. అలా లేనిచో ఆ పనులకు  ఎలాంటి అర్ధం లేదు.


ఇలా బ్రాహ్మణులు ప్రజల కోసం దేవునికి మొక్కే స్వభావం కలవారు. అలాంటి బ్రాహ్మణులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చాలా మంది బ్రాహ్మణులు బాగా చదువుకున్న కాని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు.అందువల్ల వారు ఉద్యగాలు సాధించలేక కేవలం తమ కులవృత్తి పూజారి గానే మిగిలిపోతున్నారు. అందువల్ల వారికి సమాజంలో గౌరవ మర్యాదలు వున్నా కాని ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వారి కుటుంబంలో ఒక వ్యక్తికైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..


బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.



మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: