సెలబ్రిటీస్ అటువంటి యాడ్స్ చేస్తే, వారికి తప్పదు భారీ మూల్యం...?

VAMSI
ప్రస్తుత కాలంలో... పలు సంస్థలు వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువుల మార్కెటింగ్ కొరకు ప్రముఖ టీవీ చానెళ్లలో వాటికి సంబంధించి ఆసక్తికరమైన ప్రకటనలు ఇస్తున్నారు. వాటి డిమాండ్ మరింత పెంచేందుకు ప్రముఖ సెలబ్రెటీలతో ఆ యాడ్స్ ను చేయిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఆ వస్తువు గురించి అర్థమవుతుంది. అదేవిధంగా కొనుగోలుదారులు పెరుగుతారు. శాస్త్రీయమైన యాడ్స్ వలన  సమస్య లేదు... కానీ ఇంకో రకమైన యాడ్స్.. అనగా అభూతకల్పనలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఇదే తరహాలోనే నడుస్తున్నాయి.
 
ఉదాహరణకు ఈ యంత్రం మీ ఇంటి ముందు పెట్టుకుంటే ఎటువంటి శక్తి మిమ్మల్ని ఏమి చేయలేదు...  ఈ రుద్రాక్ష మెడలో వేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది...మీరు ఊహించని రీతిలో ఐశ్వర్యవంతులుగా మారుతారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కువగా ట్రోల్ అవుతున్న మరో ప్రకటన, ఈ మందును రెండు చుక్కలు కలిపి ఇస్తే చాలు ఆ వ్యక్తి ఇక మద్యాన్ని కానీ ధూమపానాన్ని కానీ ముట్టడు. కావాలంటే దీన్ని వాళ్లకు తెలియకుండా కూడా ఆహారంలో కలిపి ఇవ్వవచ్చు. ఎటువంటి రంగు, రుచి మరియు వాసన ఉండదు అంటూ పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తున్నారు.

ఇలాంటి.. ప్రకటనలు చాలానే చూస్తున్నాము. వీటి గురించి కొన్ని కీలక విషయాలను తెలియజేశారు ప్రముఖ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు సాయి. ప్రస్తుతం ఇటువంటి అబూతకల్పనకు సంబంధించిన ప్రకటనలు చాలానే వస్తున్నాయి. జాతకాలను నమ్మే వారిని వాడుకుంటూ సొమ్ము చేసుకునేటటువంటి స్టైల్ పెద్ద ఎత్తునే జరుగుతుంది అన్నారు సాయి. అశాస్త్రీయ మైనటువంటి ఇటువంటి ప్రకటనలకు సెలబ్రిటీలను పెట్టి చేస్తుంటారు. అప్పుడు వాటిని మరింత నమ్మి ఎక్కువగా కొనుగోలు చేస్తారని వారి ఉద్దేశం. దీని మీదనే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ కోర్ట్ బెంచి ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిందని తెలియచేశారు సాయి.

ఆ తీర్పు ఏంటంటే..?? టీవీలో వచ్చే అశాస్త్రీయమైన ప్రకటనలతో పాటుగా... ఆ ప్రకటనలు ఇచ్చేవారు వాటిని ప్రచారం చేసేవారు సెలబ్రిటీలు అయినా సరే... వారి మీద కేసు నమోదు చేయమని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. కాబట్టి ఇటువంటి అశాస్త్రీయమైన నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకుని చేసే ఏ యాడ్స్ అయినా... వాటిలో చేసే సెలబ్రిటీలపై, ఆ సంస్థల పై కూడా కేసులు పెట్టమని ఆర్డర్స్ జారీ అయ్యాయి . కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకటనల విషయంలో జాగ్రత్త వహించాలి అని పేర్కొన్నారు సాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: