వామ్మో.. ఇండియాలో ఇంతమందికి కరోనా వచ్చిందా.. ఐసీఎంఆర్ సర్వేలో అసలు నిజాలు.?
ఇక కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చినప్పటికీ కరోనా వైరస్ విజృంభణ మాత్రం ఎక్కడా కట్టడి కాలేదు దీంతో ఇక ఇదే రీతిలో కొనసాగితే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అని అటు ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్దంగా వ్యవహరించడంతో చివరికి కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే . ఇక ప్రస్తుతం దేశంలో అతి తక్కువ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ప్రజలందరిలో కరోనా వైరస్ అంటే భయం పోవడమే కాదు అవగాహన పెరిగి పోవడంతో ఇక తక్కువ కేసులు నమోదవుతున్నాయి అనే చెప్పాలి.
అయితే దేశంలో ఇప్పటివరకు ఎన్ని కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి అనే దానిపై ఇటీవల ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. 135 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చు అని ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వైరస్ వచ్చి పోయిన విషయం కూడా తెలియదు అంటూ ఐసీఎంఆర్ అధికారి ఒకరు తెలిపారు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్లనే కరోనా లక్షణాలు బయట పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఏకంగా 15 మందిలో ఐదుగురికి యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.