కరోనా విషయంలో సమాజానికి సమాచారం ఇవ్వడంలో మీడియా పాత్ర శోచనీయం...?

VAMSI
కరోనా నేపథ్యంలో మీడియా వారు సమాజానికి అందిస్తున్న సమాచారాన్ని ఏ రకంగా తీసుకోవాలి అన్న అంశంపై విశ్లేషించారు ప్రముఖ జర్నలిస్టు సాయి. ఇక్కడ మీడియా పాత్ర సమాజాన్ని భయపెట్టడమా ? లేదా సమాజానికి  ధైర్యం ఇవ్వడమా ? లేక సమాజానికి సమాచారం ఇవ్వడమా ?... ఇది అందరికీ తెలియాల్సిన సందర్భం అని అన్నారు సాయి. ఎందుకంటే కరోనా స్టార్ట్ అయింది. ఒకటొకటి సంఖ్య పెరుగుతూ వస్తోంది, ఈ నేపథ్యంలో అక్కడ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది, అన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి అంటూ.. భయపడిపోండి అన్నారు.. ఓకే గుడ్ సంతోషమే.. ఎందుకంటే అలాంటి ముందస్తు హెచ్చరిక వలనే జనాలందరూ అలర్ట్ అయ్యారు.. కంట్రోల్ అయింది అనుకుందాం.

ఆ తర్వాత కాలక్రమేణా కేసులు పెరగడం చూశాము. కరోనా బాధితుల సంఖ్య వందల నుండి వేలకు పెరిగింది. ఈ క్రమంలో మీడియా నుండి అందిన వార్తలు అప్పట్లో ఎలా ఉన్నాయి అంటే, కరోనా విజృంభణ విలయతాండవం చేస్తోంది, ఈ నెలాఖరు కల్లా రెండు కోట్ల అయిపోతాయి, ఐదు కోట్ల అయిపోతాయి, 40 కోట్ల అయిపోతాయి దేశంలో ఇంత మంది చనిపోతారు అని గణాంకాలు చెప్పేశారు. ఒక కోటి మందిని వారి లెక్కలతో చంపేశారు మీడియా వారు అని పేర్కొన్నారు సాయి. ఫైనల్ గా ఏం జరిగింది ఇక్కడ భారతదేశంలో మన దగ్గర ఉన్నటువంటి ప్రాక్టికల్ వనరులు, మన దగ్గర ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి వంటి అద్భుత అంశాల గురించి అవగాహన లేక ఇలా అన్నారా అంటే, అవగాహన ఉన్నప్పటికీ కరోనాని పెద్ద విపత్తు గా చూపించారు.

వీరికి సెన్సేషనల్ న్యూస్ కావాలి... కనుక అలా చేశారు, అది అయిపోయింది. వాళ్ళలా అన్ని శాపనార్ధాలు పెట్టినప్పటికీ, వారి అభిరుచికి తగ్గట్లు జనాలకి ఏమి అంత పెద్ద నష్టం ఏం జరగలేదు.
కొన్ని మరణాలు సంభవించాయి. ఇది బాధాకరమైన విషయమే అయితే త్వరగానే రికవరీ అయింది ఇండియా అని తెలిపారు సాయి. ఇక ప్రస్తుతం ఇవ్వాళ రోజున పరిస్థితి ఏమిటంటే 8563 కేసులు అది దేశ వ్యాప్తంగా రిజిస్టర్ అయిన పాజిటివ్ కేసులు... ఇక దేశంలో రికవరీ రేటు 99% నడుస్తోంది అని క్లారిటీ ఇచ్చారు సాయి. ఇక్కడ ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి అత్యల్పము, మరియు నామమాత్రం అయిపోయింది. జనాలు ఎలా ఉన్నారంటే అసలు టోటల్ గా కరోనా భయం నుండి బయటపడ్డారు.

దేశంలో కరోనా ఉంది అనే ఫీలింగే వాళ్లకు లేకుండా పోయింది.. స్వేచ్ఛా జీవితం స్టేజ్ కి తిరిగి వచ్చేసారు జనాలు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా వాళ్ళు కరోనా గురించి ఒక్క ముక్క కూడా రాయట్లేదు. అప్పట్లో కరోనాని పెనుభూతంలా చూపిన మీడియా వారు... ఇప్పుడు అసలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.... కరోనా గురించి  అప్పట్లో భయ పెట్టిన మీడియా వాళ్లు, ఇప్పుడు తగ్గుముఖం పట్టిన సమయంలో భరోసా కూడా ఇవ్వాలి కదా. కరోనా తగ్గిందని న్యూస్ చెప్పి ధైర్యాన్ని పెంచాలి కదా అని ప్రశ్నించారు రాజకీయ విశ్లేషకుడు సాయి. కరోనా గురించి భయపెట్టినందుకు నేను మీడియాను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే అలర్ట్ అవడం మంచిదే.

తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఇది తెలియని వాళ్లు భయంతో వణికి పోవాలా..? మీడియా భరోసా ఇవ్వచ్చు కదా... అని ప్రశ్నించారు సాయి. ఇంకొకటి వ్యాక్సినేషన్ సజావుగా సాగుతోంది భారీ సంఖ్యలో ఇస్తున్నారు. కానీ దీనిపై కూడా పెద్దగా వార్తలు కనిపించడం లేదు. ఇలా నెగిటివ్ వార్తలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ పాజిటివ్ వార్తలకు ఇవ్వకపోవడం వల్లనే మీడియాపై దురభిప్రాయం నడుస్తోంది. అది మార్చుకోవాలా..? లేక ఇదే ధోరణి కొనసాగించాలా ? లేదా జనం చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అనే ధోరణి తో ముందుకు వెళ్తున్న వారి సాక్షిగా భవిష్యత్తు తేల్చాలి.

ఇక ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కరోనా కాటు నుండి ప్రపంచం బయటపడుతోంది మ్యాగ్జిమం బయటపడింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మరియు బ్రెజిల్ వంటి దేశాలు కరోనాతో ఇప్పటికీ గిలగిలలాడుతుంటే... భారత దేశం మాత్రం రికవరీ రేటులో నెంబర్ వన్ గా నిలుస్తోంది. 138 కోట్ల జనాభా కలిగినటువంటి మన భారతదేశంలో మీరు 8300 కేసులకు వచ్చాము అంటే మన శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: