నెలకు 1000 రూ.లతో.. చేతికి 4 లక్షలు.. అదిరిపోయే లాభం..?
ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడితే భారీ రాబడి పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఎంతోమంది తమ దగ్గర ఉన్నడబ్బులతో మరింత ఆదాయాన్ని సంపాదించేందుకు ఏకైక మార్గంగా మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకున్నారు. అయితే దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన ఎస్బిఐ అనుబంధ సంస్థ ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ కూడా ఈక్విటీ ఫండ్స్ అందిస్తుంది. ఇందులో ఎస్ బి ఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి. దీని ద్వారా కస్టమర్లకు మంచి రాబడి పొందే అవకాశం ఉంది. ఒకవేళ 2011 జనవరి 18 నుంచి మీరు నెలకు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే ఇప్పుడు మీ విలువ ఏకంగా 1.2 లక్షలు అయ్యేది.
ఇక తద్వారా మీ రాబడి ఏకంగా నాలుగు లక్షలు ఉండేది. ఇక కెనెరా రోబోకు ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ కూడా పదేళ్లలో 20 శాతం రాబడి అందించింది. ఇందులో మీరు నెలకు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే ప్రస్తుతం మీరు 3.47 లక్షల ఆదాయం పొందే వారు. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా 20.13 శాతం రాబడి అందించింది. మీరు పదేళ్ల నుంచి నెలకు రూ.1000 పెడుతూ వచ్చి ఉంటే మీకు రూ.3.47 లక్షలు వచ్చేవి.