సారీ నిమ్మగడ్డ.. మీరు చెప్పినా కుదరదు.. తేల్చేసిన సీఎస్..!?
అంతే కాదు.. ఈ విషయాలు వివరిస్తూ సీఎస్‌కు లేఖ రాశారు. వీడియో కాన్ఫరెన్స్ జరక్కుండా తాను ఎలా ప్రభావితం చేయగలనో ఎస్ ఈ సి చెప్పాలన్నారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించాను తప్ప.. పరిధి దాటలేదన్నారు ప్రవీణ్ ప్రకాష్. తానెక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించానో ఇప్పటికీ నాకర్ధం కావడం లేదని.. స్వతంత్రంగా వ్యవహరించే అధికారం తనకు లేదని..సీఎస్ సూచనల మేరకే నేను నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు ప్రవీణ్ ప్రకాశ్.
ప్రవీణ్ ప్రకాశ్ లేఖతో ఆడకత్తెరలో ఇరుక్కున పోకచెక్కలా మారిన సీఎస్ చివరకు నిమ్మగడ్డకే షాక్ ఇచ్చారు. సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిమ్మగడ్డ రాసిన లేఖకు సీఎస్ సమాధానిచ్చారు. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరని సీఎస్ లేఖలో స్పష్టం చేశారు. ప్రవీణ్ ప్రకాశ్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆదేశాలను పునఃపరిశీలించాలని నిమ్మగడ్డను సీఎస్ కోరారు.
అయితే.. ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేయాలని ఆదిత్యనాథ్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఆపై మరోసారి లేఖ రాశారు. ప్రవీణ్‌ప్రకాశ్ ను తొలగించకపోవడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ అవుతుందని లేఖలో నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. అయినా సరే సీఎస్ మాత్రం ప్రవీణ్ ప్రకాశ్ పై చర్య తీసుకోవడం కుదరదని తేల్చేశారు. మరి ఈ వివాదం ఇంకా ఏం మలుపులు తిరుగుతుందో..!