మదనపల్లె హత్యల్లో మరో ట్విస్ట్: అక్కాచెల్లెళ్ల ఫేస్‌బుక్ వాడుతుందెవరు..?
తాజా ఈ అక్కాచెళ్లెళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసిన పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే.. సాయిదివ్య సోషల్ మీడియా అకౌంట్లు చాలా తేడాగా ఉన్నాయట. దివ్య ఇటీవల పెట్టిన కొన్ని పోస్టులు తాజాగా మాయమయ్యాయట. అంతే కాదు.. ఆమె డీపీ బదులు డీపీగా అక్క అలేఖ్య ఫొటోను పెట్టారట. ఇలా ఎవరు మార్చారనే అంశంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద కుమార్తె అలేఖ్య ఖాతా ప్రైవసీ సెట్టింగ్స్‌పైనా సందేహాలు వస్తున్నాయి.
అసలు హత్యకు నాలుగు రోజుల ముందు నుంచే వివాదాస్పద పోస్టులు వీరి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతకు ముందు వరకూ అంతా బాగానే ఉందట. ఈనెల 21న 'శివుడు వస్తున్నాడు, పని అయిపోయిందంటూ' పోస్టులు పెట్టింది అక్క. 22న కృష్ణుడి బొమ్మతో సెల్ఫీ దిగి మోహినీ అనే హ్యాష్ ట్యాగ్ వాడింది అలేఖ్య. ఈనెల 24న అలేఖ్య, సాయి దివ్య హత్యకు గురయ్యారు. వీరి సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చిన మార్పులపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొంపదీసి అక్కాచెల్లెళ్ల సామాజిక ఖాతాలు మరెవరైనా వాడుతున్నారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.. ఈ విషయంపై దృష్టి పెట్టి సాంకేతిక నిపుణులతో వీరి అకౌంట్స్ మళ్లీ చెక్ చేయిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే కానీ.. ఈ హత్యల్లో వేరే ఎవరి హస్తమైనా ఉందా అన్న విషయం తెలుస్తుంది..