జగడ్డ : బాబోరు అలా చేసారంటే.. జగనోరి గుట్టు రట్టవుతుంది..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అవసరం లేదేమో అనే విధంగా ప్రస్తుతం ఏకగ్రీవాలు ప్రభావితం చేస్తున్నాయి. ఇక అన్ని ఏకగ్రీవాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో ప్రతిపక్ష టీడీపీ పార్టీకి కొత్త తలనొప్పిగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు రంగంలోకి దిగితే ఏకగ్రీవాలా గుట్టు రట్టు అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. వైసిపి టిడిపి నేతలను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి తమ వైపుకు తిప్పుకుని బలవంతపు ఏకగ్రీవాలు చేస్తుంది అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. తప్ప ఎవరు కూడా రంగంలోకి దిగి ఏకగ్రీవం వెనుక ఉన్న అసలు ఈ విషయాన్ని బయట పెట్టేందుకు ముందుకు రావడం లేదు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి పలు నియోజకవర్గాల్లో పర్యటించి.. ఇక పలు గ్రామ పంచాయతీలలో టిడిపి నేతలు అందరిలో ధైర్యం నింపి ఇక పోటీకి నిలబెడితే.. ఇక మిగతా ప్రాంతాలలో ఉన్న టీడీపీ నేతలు అందరిలో కూడా దైర్యం వచ్చి ఏకగ్రీవాలు వెనుక అసలు కథ ఏంటి అన్న విషయాన్ని బయట పెట్టే అవకాశం ఉందని తద్వారా జగన్ పార్టీ గుట్టురట్టు అవుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. మరి చంద్రబాబు ఏం చేయబోతున్నారు అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.