బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు జైలు.. ఆ నేతల గుండెళ్లో రైళ్లు..?

Chakravarthi Kalyan
రాజాసింగ్.. బీజేపీకి ఎమ్మెల్యే.. ఐదేళ్ల క్రితం ఆయన బీఫ్‌ ఫెస్టివల్ గురించి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఆ కేసులో ఆయనకు ఇప్పుడు రెండేళ్ల జైలు శిక్ష పడింది. బీఫ్ ఫెస్టివల్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో  జరిగిన బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు  బిజెపి కార్యకర్తలతో ఎమ్మెల్యే రాజాసింగ్  వెళ్లారు. ఓయూలో రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

బొల్లారం ఇన్స్పెక్టర్ బీజేపీ కార్యకర్తలను కొట్టారని గొడవ పడ్డారు రాజాసింగ్. దీంతో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే వెంటనే రాజాసింగ్ కు బెయిల్ వచ్చింది.  దీనిపై రాజాసింగ్ నాంపల్లి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నారు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో దూకుడుగా వెళ్తోంది. ఆ క్రమంలోనే నోటికి బాగా పని చెబుతున్నారు. ప్రత్యేకించి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక విమర్శల జోరు పెరిగింది.

బండి సంజయ్.. మాటలతోనే మంటలు పుట్టిస్తున్న నాయకుడు.. ఇటీవల కాలంలో తెలుగు నేలపై ఈ స్థాయిలో ఎవరూ మాటలతో మంటలు పుట్టించ లేదు. చూడటానికి మనిషి సాత్వికంగా కనిపించినా.. నోరు తెరిచాడంటే డైనమెట్లు పేలాల్సిందే.. బండి సంజయ్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు.. ఆయన తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాతే  ఆపార్టీకి మంచి జోష్ వచ్చింది. దుబ్బాక ఎన్నికలు గెలిచారు.. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు వణుకు పుట్టించారు. ఇప్పుడు అదే జోష్ అటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇప్పుడు రాజాసింగ్ కు జైలు శిక్ష పడటంతో బండి సంజయ్ సహా బీజేపీ నేతలు షాకయ్యారట. అందుకే కాస్త నోరు జాగ్రత్త గా పెట్టుకుంటే మంచిదని భావిస్తున్నారట. మరి ఈ భయం ఇప్పుడేనా ఇంక ముందు కూడా ఉంటుందా.. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: