మరోసారి రెచ్చిపోయిన చైనా.. స్ట్రాంగ్ వార్నింగ్.. బైడెన్ ఏం చేస్తారో..?
ఈ క్రమంలో ఇప్పటికే టిబెట్ దేశాన్ని చైనాలో ఒక భాగంగా మార్చుకుంది చైనా. ఇక అదే సమయంలో చైనకు సరిహద్దుల్లో ఉన్న తైవన్ దేశాన్ని కూడా తమ దేశంలో కలుపుకోవడానికి చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తైవాన్ చిన్న దేశం అయినప్పటికి కూడా ఎప్పుడూ చైనాలో కలవడానికి ఆసక్తి చూపలేదు. ఇక అదే సమయంలో ఎప్పటికప్పుడు తైవాన్ చైనా దేశంలో ఒక భాగం అంటూ చైనా ఎప్పటికప్పుడు వాదన వినిపిస్తూనే ఉంది. కానీ తైవాన్ మాత్రం చైనా వాదనను ఎప్పుడూ ఖండిస్తూనే ఉంది.
ఇక ఇటీవలే చైనా లో భాగమే తైవాన్ అంటూ చైనా వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవలే తైవాన్ కు ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది చైనా. తైవాన్ ఒకవేళ స్వాతంత్రం అనే పేరు ఎత్తితే మాత్రం నాశనం చేస్తాం అంటూ చైనా వార్నింగ్ ఇచ్చింది అయితే దీనిపై విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్ లో ప్రస్తుతం ప్రజలు ఎన్నుకోబడిన నాయకులే పాలనను కొనసాగిస్తున్నారని ప్రజాస్వామ్యబద్ధంగా తైవాన్ ముందుకు సాగుతుందని అలాంటి తైవాన్ ను నాశనం చేస్తామనడం దారుణం అని అంటున్నారు విశ్లేషకులు. అయితే గతంలో తైవాన్ విషయం లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అండగా నిలవగా ప్రస్తుతం జో బైడెన్ ఎలా వ్యవహరించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.