జగడ్డ : నాటి ప్రభావం నేటి ఎన్నికలపై.. జగనోరి మౌనం చేదు అనుభవం..?
దీనికంతటికీ కారణం జగన్ మౌనమే అని అంటున్నారు. సాధారణంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో దూకుడుగా వ్యవహరించారు సీఎం జగన్. ప్రతి విషయంలో తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే గతంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి వచ్చిన సమయంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు వైసీపీ నేతలు. ఇక దారుణంగా దాడులు చేసిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వచ్చాయి. అంతలా దాడులు చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినప్పటికీ అధినేత జగన్ మాత్రం మౌనంగా వుండిపోయారు.
మరోవైపు రౌడీ రాజకీయం చేస్తున్నారని ఇక వైసీపీ నేతలు చేసిన దాడులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించాయి. ప్రతి విషయంలో దూకుడుగా వ్యవహరించె జగన్ ఈ విషయంలో మాత్రం నోరు విప్పకపోవడం తో పాటు ప్రజల్లో కూడా జగన్ సర్కార్ పై కాస్త వ్యతిరేకత వచ్చింది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక నాటి ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన దాడులు మరికొన్ని రోజులలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు.
ఈ క్రమంలోనే గతంలో వైసీపీ నేతలు దాడి చేసిన సమయంలో సీఎం జగన్ కనీసం వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండడం పై ప్రజలు అసంతృప్తితో ఉండడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కు షాక్ ఇచ్చేందుకు ఎంతో మంది ప్రజలు సిద్ధమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే నాడు జగన్ మౌనమే నేడు వైసిపి పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది అని అంటున్నారు విశ్లేషకులు. మరికొన్ని రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారూ అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.