జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న తేదేపా కార్యకర్తలకు శుభవార్త! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాళ్లకు గద్వాల్ వేదిక అయ్యింది. నిన్న రాత్రి వేదిక కూలడంతో గాయ పడిన బాబును పరామర్శించడానికి హైదరాబాద్ నుండి ఎన్టీఆర్ ఇవ్వాళ మామయ్య వద్దకు ప్రయానమయ్యాడు. గత కొంత కాలంగా బాబుకు ఎన్టీఆర్కు పొసగడం లేదని వార్తల నేపద్యంలో, ఇవాల్టి ఎన్టీఆర్ పర్యటనతో కాస్తబ్రేక్ పడ్డట్లయింది.
బాబు తన తనయాడు లోకేష్ ని పార్టీకి వారసుడిగా చేస్తున్నాడని బాబుఫై కినుక వహించారు హరికృష్ణ, ఆయన కొడుకు ఎన్టీఆర్. ముఖ్యంగా గుడివాడ ఎం ఎల్ ఏ కొడాలి నాని పార్టీ వదిలి జగన్ వద్దకు చేరుకోవడం లో జూనియర్ ఎన్టీఆర్ పాత్రా ఉందని, బాబుకు గుణపాటం చెప్పలనే ఇలా చేసాడని ప్రచారం లో ఉంది. దీనికి తగట్టుగానే నాని వ్యవహారంలో విలేకరుల సమవేశం పెట్టినప్పుడు ఎన్టీఆర్ కట్టే కాలే దాకా పార్టీ వీడను అన్నాడు. కాని ఎక్కడ బాబు పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్తపడ్లేదు.
కానీ బాబు 'వస్తున్న మీకోసం' యాత్ర హిందూపూర్ నుంది మొదలు పెట్టినప్పుడు అన్ని తానై హరికృష్ణ నడిపించాడు. యాత్రకు వచ్చిన స్పందన చూసి విశ్లేషకులు మళ్లీ పార్టీ పున్జుకోనుంది అన్న సమయoలో నందమూరి వంశం మళ్లీ తమ పాత్రా పోషించాలని కోస్తాలో పార్టీకి పట్టున సామాజిక వర్గం నుండు ఒత్తిళ్ళు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వచ్చి మామయ్య ఆరోగ్యం బాగుపడాలని రాష్త్రానికి , పార్టీకి పునర్వ్య్భావం తేవాలని కోరుకుంటునట్లు చెప్పాడు. ఇక తను షూటింగ్ నుండి తీరిక చేసుకొని యాత్రలో ఎప్పుడు పాల్గొనేది త్వరలో చేబుతానని అన్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: