మరో కొత్త వివాదంలో మోడీ సర్కార్..

Chakravarthi Kalyan
ఇప్పటికే గవర్నర్ల బదిలీలు, ఉద్వాసనలతో అనేక వివాదాలకు కారణమైన మోడీ సర్కార్ ఇప్పడు మరోసారి అలాంటి వివాదంలో ఇరుక్కుంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ను మాజీ కేరళ గవర్నర్‌గా నియామించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇదెక్కడి సంస్కృతి అంటూ మండిపడుతున్నాయి. మొత్తం వ్యవహారం చూస్తే ప్రభుత్వం రాజీపడినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సదాశివం పనితీరు, నిర్ణయాలు ప్రధానమంత్రిని ఆకర్షించాయా అంటూ కాంగ్రెస్‌ ప్రశ్నించింది. బీజేపీ ఒక దుష్ట సంప్రదాయానికి తెరలేపిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఈ నియామకంలో నిబంధనలు ఉల్లంఘించనప్పటికీ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్‌ సదాశివం వెల్లడించిన తీర్పులపై సందేహాలు సహజంగానే మొదలవుతాయని వ్యాఖ్యానించింది. మరోవైపు బీజేపీ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ప్రముఖుల్లో ఎవరినైనా గవర్నర్‌గా నియమించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని గుర్తు చేసింది. మాజీ ప్రధాన న్యాయమూర్తిని కాంగ్రెస్‌ వేలెత్తి చూపిస్తోందని కౌంటర్ ఇస్తోంది. గవర్నర్‌గా జస్టిస్‌ సదాశివం నియామకాన్ని కేరళ ప్రభుత్వం మాత్రం స్వాగతించింది. ప్రభుత్వానికి, గవర్నర్‌ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని ఆ రాష్ట్ర హోం మంత్రి స్పష్టంచేశారు. ఏదేమైనా గవర్నర్ల విషయంలో మాత్రం మోడీ సర్కారు వివాదల సుడిగుండలో చిక్కుకుంటోంది. బీజేపీ కావాలనే ఈ పనులు చేస్తున్నందువల్ల అందుకు మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోకతప్పదని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: