తెలంగాణలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 10 రోజులే ఛాన్స్..!?
అదే సింగరేణి నోటిఫికేషన్.. సింగరేణిలో ఈ ఏడాది తొలి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 651 ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. తొలి విడత 372 ట్రైనీ ఉద్యోగాలకు ఆ సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఉద్యోగాల్లో 128 ఫిట్టర్ ఉద్యోగాలు, 51 ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు, 54 వెల్డర్ ఉద్యోగాలు, 22 టర్నర్/మెషినిస్టు ఉద్యోగాలు, 14 మోటారు మెకానిక్ ఉద్యోగాలు, 19 ఫౌండ్రీమెన్/మౌల్డర్ ఉద్యోగాలు, 84 జూనియర్ స్టాఫ్‌నర్సు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సింగరేణి సంస్థ తెలిపింది.
సింగరేణి సంస్థ ఇస్తున్న ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ కింద 305 పోస్టులను కేటాయించింది. వీటిని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని తెలంగాణ వారందరికీ అన్ రిజర్వుడు కింద వర్తింపజేస్తారు. స్థానిక రిజర్వేషన్ కింద భర్తీ చేయనున్న వాటిలో 105 ఫిట్టర్, 43 ఎలక్ట్రీషియన్, 44 వెల్డర్, 18 టర్నర్/మెషినిస్టు 18, 16 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 67 స్టాఫ్ నర్సు, 12 మోటారు మెకానిక్ పోస్టులున్నాయి.
ఇక ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు www.scclmines.com వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు ఫిబ్రవరి 4 తుది గడువు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసి ఆ హార్డ్ కాపీని సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపాలి. www.scclmines.com వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకుని.. మీకు అవకాశం ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.. ఆలస్యం చేయకండి.