భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి బ్రేక్... అప్పుడే అడ్డంకులా..!
ఇక శనివారం ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో వచ్చిన సాంకేతిక సమస్యలతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నామని, జనవరి 19న తిరిగి ప్రారంభిస్తామని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తొలి రోజు ఇక్కడ 28, 500 మందికి టీకా వేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా కేవలం 18 వేల మందికి మాత్రమే టీకా వేశారు. ఇక టీకా తీసుకున్న వారిలో పది మందికి వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే వీరిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోనూ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎకనాలెడ్జ్ మెంట్‌ను అధికారులు ఇవ్వలేకపోయారు. ఇక పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో కూడా ఈ వెబ్ సైట్ పలు సార్లు మొరాయించడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు పలుమార్లు ఆటంకం కలిగింది. ఇక ఒడిశాలోనూ ఈ ప్రక్రియ నిలిచి పోయింది. దీంతో అక్కడ కూడా ఒక రోజు ఆలస్యంగా వ్యాక్సినేషన్ వేస్తామని అధికారులు చెపుతున్నారు. ఇక ముంబై మహా నగరంలో తొలి రోజు 4 వేల మందికి వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ పెట్టుకుంటే కేవలం 1900 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. మరి ఈ ప్రక్రియ ఎప్పటి సజావుగా పూర్తవుతుందో ? చూడాలి.