షాకింగ్‌: బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అత్త, మరిది..!?

Chakravarthi Kalyan
బోయినపల్లి కిడ్నాప్‌ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మరికొందరి పేర్లు చేర్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ ఏ వన్ నిందితురాలుగా ఉన్నారు. ఆమె భర్త భార్గవ రామ్ ఏ3 నిందితుడుగా ఉన్నారు. అయితే తాజాగా భార్గవ రామ్ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయిని చేర్చిన ఈ కేసులో పోలీసులు నిందితులుగా చేర్చినట్టు తెలుస్తోంది.

కిడ్నాప్ తర్వాత భార్గవ్‌రామ్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కోసం పోలీసులు ఇంకా వెదుకుతున్నారు. అయితే ఈ కిడ్నాప్ ప్లాన్ నుండి నిందితులు పారిపోయేందుకు భార్గవ్‌ రామ్‌ తమ్ముడు.  అఖిల ప్రియ మరిది చంద్రహాస్‌, భార్గవ్‌ రామ్ తల్లి, అఖిల ప్రియ అత్తగారు కిరణ్మయి కూడా సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే ఈ కేసులో పోలీసులు వారిని కూడా నిందితులుగా చేర్చారు.

త్వరలో పోలీసులు భార్గవ రామ్ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయిని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇక భార్గవ్‌ రామ్ ఇంకా పోలీసుల చేతికి చిక్కపోయినా.. అతని ఆచూకీ తెలిసింది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతని కీలక అనుచరుడు శ్రీను కర్ణాటకలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం ఆ కిడ్నాప్‌ పథకం మొత్తం భార్గవ్‌ రామ్ దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేశాడట. కిడ్నాప్‌ పూర్తయిన తర్వాత తర్వాత భార్గవ్ రామ్ కిడ్నాపర్లకు చెప్పినట్టుగా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ చేరుకున్నాడట. అక్కడే  ప్రవీణ్‌, నవీన్ లతో భార్గవ్‌రామ్‌ సంతకాలు చేయించారట.

ప్రవీణ్ రావు, నవీన్‌ తో సంతకాలు తీసుకున్న తర్వాత.. భార్గవ్‌ రామ్‌, మాదాల శీను ఇద్దరూ తెలంగాణ విడిచిపోయేందుకు ప్రయత్నించారు. వారిద్దరూ కొంత దూరం కలిసి ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారిలో భార్గవ్‌ రామ్ మహారాష్ట్రకు, శీను కర్ణాటకకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని గంటల తర్వాత వారు తమ సిమ్‌ కార్డులు పారేశారట. వారి ఆచూకీకి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమయ్యాయని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: