షాకింగ్‌: అఖిల ప్రియ అసలు కిడ్నాప్‌ ఎందుకు చేసిందో తెలుసా...!

Chakravarthi Kalyan
బోయినపల్లి కిడ్నాప్ కేసు విషయంలో మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీలో అనేక ఆసక్తికరమై విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల కథనం ప్రకారం.. అసలు ఆమె ఎందుకు కిడ్నాప్‌ చేసిందంటే.. అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి చాలా ఏళ్ల క్రితం హఫీజ్‌ పేటలో దాదాపు 33 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. అయితే ఇలాంటి భూములు చాలా వరకూ బినామీల పేరుతోనే ఉంచుకునేవారు.

అలా భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల భూమికి బినామీగా  ఏవీ సుబ్బారెడ్డి ఉండేవారు. ఆ భూముల వ్యవహారం అంతా సుబ్బారెడ్డి చూసుకునేవారు. అయితే ఆ భూములపై అనేక వివాదాలు ఉండేవి. వాటిని పరిష్కరించుకునేందుకు భూమా నాగిరెడ్డి  2005లో కృష్ణారావు అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా నియమించుకున్నారు. ఆ తర్వాత ఆ న్యాయవాది కృష్ణారావు మరణించారు. ఆ తర్వాత  ఆయన బాధ్యతలు కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు సునీల్ రావు  తీసుకున్నారు.

హఫీజ్‌ పేటలో ఉన్నది భూమి విషయంలో పలు న్యాయ వివాదాలు ఉన్నాయి. అది దాన్ని అమ్మడం కానీ.. కొనసాగించడం కానీ ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి మరణించారు. ఆయన మరణంతో బినామీ ఏవీ సుబ్బారెడ్డి ఆ భూమిని కొంత సొమ్ము తీసుకుని ప్రవీణ్ రావు సోదరులకు అప్పగించేశారు. దీంతో ఆ భూమి అప్పటి నుంచి ప్రవీణ్ రావు సోదరులదిగా ఉండేది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న భూమా అఖిలప్రియ సుబ్బారెడ్డిపై మండిపడింది.

తండ్రి అనుచరుడుగా ఉంటూ ఇంత ద్రోహం చేస్తావా అని కోప్పడింది. ఎలాగైనా తండ్రి భూమిని మళ్లీ సొంతం చేసుకోవాలని భావించింది. అందుకే కొంత కాలంగా ప్రవీణ్ రావుతో పాటు వాళ్ల భాగస్వాములపై ఒత్తిడి తెచ్చింది. భూమా నాగిరెడ్డికి చెందిన భూమిని ఎలా సొంతం చేసుకుంటారని, వాటా ఇవ్వాల్సిందిగా కోరింది. నిరాకరించడంతో అపహరణ చేసి... బలవంతంగా భూమిని రాయించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు దొరికిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: