సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్..ఏంటీ వెటకారం..?
ఇప్పుడు అర్థమయ్యిందా.. బాబుగారి వెటకారం.. అదీ కాక. ఈ వెటకారం అంతా.. పండుగపూట కావడం మరో విశేషం. అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగీ పండుగ రోజు కూడా అబద్దాలు మానలేదన్నమాట. ఆయన చెప్పేదేంటంటే.. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ది చేసేశారట. అదే తన తప్పు అయితే క్షమించాలట. ఇక ముఖ్యమంత్రి జగన్ పై ఏది పడితే అది మాట్లాడడం కూడా చంద్రబాబు అలవాటే కదా.. ప్రజలపై జగన్ డెబ్బైవేల రూపాయల చొప్పున భారం వేశారని చంద్రబాబు ఆరోపించారు.
అంతే కాదు.. జగన్ నాటకాలు నమ్మి ప్రజలు పూనకం వచ్చినట్లు ఆ పార్టీకి ఓటు వేశారని చంద్రబాబు గుండెలు బాదుకుంటున్నారు. తానేమి తప్పు చేశానో తెలియదని, రాష్ట్ర అభివృద్దికి కృషి చేశానని, అదే తన తప్పు అయితే క్షమించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అమరావతి, పోలవరం అనే రెండు కళ్లను పొడిచేసిందని ఆయన తెగ బాధపడిపోయారు. రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని, జగన్ పేదల రక్తం తాగుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు పెడుతున్నారంటున్నారు.
అయితే అసలు విషయం వేరే ఉంది. నిజమే చంద్రబాబు ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ.. ఇలా డొంకతిరుగుడు కాదు.. అవును నేను తప్పు చేశాను.. కేవలం అమరావతి వంటి ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టి తప్పు చేశాను.. జన్మభూమి కమిటీలు దోచేస్తున్నా పట్టించుకోకుండా తప్పు చేశాను.. ఇలా చెప్పి ఉంటే కాస్త జనం నమ్మేవారేమో..