మరో రికార్డు సాధించిన జగన్ సర్కారు..!? పండగ పూట గుడ్న్యూస్..!
18.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం పనుల్ని అధికారులు పూర్తి చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు వరద నీటిని తరలించేందుకు వీలుగా ప్రాజెక్టు కొనసాగుతోంది.
43.5 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ రిజర్వాయర్ కు తరలించేందుకు వెలిగొండ ప్రాజెక్టును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొదటి టన్నెల్ ప్రాజెక్టు పనులు పూర్తి కావటంతో టన్నెల్ బోరింగ్ మిషన్ విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండో టన్నెల్ పనులు కూడా 11.02 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. గత ఏడాది జనవరి నాటికి మొదటి సొరంగం పనులు 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. కృష్ణా నది నుంచి వరదనీటిని తరలించేందుకు వీలుగా 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగాలను తవ్వేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 29 మండలాలకు తాగు నీరందే అవకాశం ఉంది. ఈ రికార్డుతో జగన్ సర్కారు కేవలం సంక్షేమంపైనే దృష్టి పెడుతోందన్న అపవాదు నిజం కాదని స్పష్టమవుతోంది. ఏదేమైనా సంక్షేమ పాలనలో వైఎస్ జగన్ తర్వాతే ఎవరైనా అనిపించేలా ఉంది ఆయన పాలన. అమ్మఒడి వంటి ఎన్నో పథకాలను ఆయన ప్రారంభించారు.
వైసీపీ అధినేత జగన్ గతంలో ఓ మాట చెప్పేవాడు.. ఒక్కసారి తనకు అధికారం ఇస్తే 30 ఏళ్లు పాలిస్తానని చెప్పేవాడు.. అంతేకాదు.. ప్రతి ఇంట్లో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా ఉండాలని.. అంతగా ప్రజలు మరిచిపోలేని సేవలు అందిస్తానని అనేవాడు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.