భారత్ వెరీ స్పెషల్.. 100 కోట్ల మందికి కరోనా వచ్చిపోయిందట..?
అయితే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకున్నవారికి కరోనా వైరస్ ఉంది అని బయట పడినప్పటికీ.. కొంతమంది కరోనా వైరస్ భయంతో లక్షణాలు ఉన్నప్పటికీ ఇంటి దగ్గరే ఉండి కోలుకున్న వారిలో మాత్రం కరోనా వచ్చింది అన్న నిజం బయటకు రాకుండానే ఉండిపోయింది. ఈ క్రమంలోనే భారత దేశంలోఎంతో మందికి కరోనా వైరస్ వచ్చి పోయింది అని గతంలో కొంతమంది వైద్య నిపుణులు కూడా చెప్పారు. ఎంతోమంది లో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని.. అంటే వారికి తెలియకుండానే కరోనా వచ్చి పోయింది అంటూ నిర్ధారించారు.
ఇక ఇటీవలే బయటపడిన నిజాలతో ప్రస్తుతం భారతదేశంలోని ప్రజలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశంలో దాదాపు వందకోట్ల మందికి తెలియకుండానే కరోనా వైరస్ వచ్చి పోయింది అన్నది వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. థైరాయిడ్ కు సంబంధించి ప్రజల దగ్గర నుండి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ కి కరోనా పరీక్షలు చేయగా దేశ వ్యాప్తంగా 70 శాతం మందికి కరోనా వచ్చి పోయింది అని అంచనా వేస్తున్నారు వైద్యనిపుణులు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు వైద్య నిపుణులు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.