పండగ ముందే విషాదం.. పతంగి ఎగరేస్తే ప్రాణం పోయింది..?
ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇక గాలిపటాలు ఎగరవేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే గాలిపటాల తో పోటీ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పదునైన మంజా లను తమ గాలిపటాలకు కట్టుకొని ఇక ఇతర గాలిపటాల దారాలు తెంచేందుకు ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు. అందుకే ఈ గాలి పటాలు ఎగుర వేయడం కూడా ఎంతో ఉత్సాహంగా సాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ గాలి పటాలు ఎగుర వేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ప్రాణాలు పోవడం ఖాయం అన్నది ఇప్పటికీ తెర మీదికి వచ్చిన ఎన్నో ఘటనలు ద్వారా అర్థం అయింది. ఇటీవల సంక్రాంతి పండుగ ముందు విషాదకర ఘటన చోటు చేసుకుంది. పతంగి మంజ తో గొంతు కోసుకోవడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. సమీపంలో కొంతమంది వ్యక్తులు పతంగి ఎగరేసిన ఉండగా బైక్పై వెళ్తున్న వ్యక్తి ఆ పతంగి దారం మెడకు చుట్టుకుంది. ఇక అప్పుడు వేగంగా ఉండడంతో ఇక యువకుడి గొంతు తెగింది. దీంతో బైక్ పై కిందపడిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.