ఆవు పేడ, మూత్రంతో తయారుచేసినవే వాడండి.. మంత్రి సూచనలు..?

praveen
ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల వస్తువులు పూర్తిగా కల్తీ అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలతో తయారు అవుతున్న ఎన్నో రకాల సబ్బులు షాంపూలు లాంటివి కూడా ఎంతో మందికి ప్రస్తుతం ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఇక ప్రస్తుతం జనాలను ఆకర్షించటానికి ఎన్నో రకాల ప్రోడక్టులు మార్కెట్ లోకి వస్తూ ఉన్నాయి. ఇక మార్కెట్లోకి వస్తున్న వివిధ రకాల ప్రొడక్టు లు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తూ ఉన్న ప్పటికీ కూడా అవి ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అని  నిపుణులు సూచిస్తున్నారు అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఆయుర్వేదం తో కూడిన వస్తువులు వాడితే ఎంతో మంచిది అంటూ సూచిస్తున్నారు.

 ముఖ్యంగా ఆవు పేడ మూత్రంతో తయారుచేసిన సబ్బులు షాంపూలు వాడటం కారణంగా ఎంతగానో మేలు జరుగుతుంది అని ఇప్పటికే ఎంతోమంది నిపుణులు కూడా సూచిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  అంతేకాదు ప్రస్తుతం కొంతమంది అయితే ఆవు పేడ మూత్రం కూడా సర్వరోగ నివారిణి అని కూడా చెబుతూ ఉంటారు.  ఆవు పేడ మూత్రం లో ఎన్నో సుగుణాలు ఉంటాయని..  దాదాపు అన్ని రకాల ఆయుర్వేద మందులలో కూడా ఆవు పేడ మూత్రం ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.

 ఇటీవలే ఓ మంత్రి కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజలందరూ కూడా ఆవు మూత్రం పేడతో తయారు చేసిన సబ్బులు షాంపూలు అగర్బత్తీలు మాత్రమే వాడాలని కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి సూచించారు. ప్రస్తుతం ఆవుపాలు పెరుగుతో పాటు ఆవు పేడ మూత్రంతో తయారు చేసేటటువంటి సబ్బులు షాంపూలు అగర్బత్తీలు మరియు వివిధ రకాల మందులను కూడా వాడటం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది అంటూ పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ కర్ణాటక ప్రజలను కోరారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని శాస్త్రీయంగా కూడా ఇది నిరూపించబడింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: