బంపర్ ఆఫర్.. రోజుకు రూ.200 చెల్లిస్తే.. అదిరిపోయే కారు మీ సొంతం..?
ప్రస్తుతం మారుతి సెలెరియో కారు ధర మార్కెట్లో 4.41 లక్షలు గా ఉంది. ఇక ఎక్స్ షోరూమ్ ద్వారా టాప్ వేరియంట్ 5.68 లక్షలు ఉంది. ఒకవేళ మీరు ఈ కారును కొనుగోలు చేయాలని భావిస్తే.. దీని కోసం 25 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించాలి.. ఇలా చేయడం ద్వారా మీకు నెలవారి ఈఎంఐ కేవలం 6481 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇక్కడ కేవలం వడ్డీ రేటు 8 శాతంగా మాత్రమే పరిగణలోకి వస్తుంది. ఇలా 7 ఏళ్ల పాటు మీరు చెల్లిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. 6481 రూపాయలకు లెక్క వేసుకుంటే.. కేవలం రోజుకి 216 రూపాయలు మాత్రమే ఆదా చేస్తే సరిపోతుంది.
ఇలా రోజుకు 216 రూపాయలు ఆదా చేస్తే కొత్త కారు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ మీరు ఈఎమ్ఐ భారాన్ని భరించలేము తక్కువ ఈఎంఐ కట్టుకోవాలి అని భావిస్తే అప్పుడు డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈఎమ్ఐ టెన్యూర్ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది.
ఇకపోతే మారుతీ సెలెరియో కారులో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, సీట్ బెల్ట్ రిమైండర్, చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, స్పీడ్ అలర్ట్ అలారం, రివర్స్ పార్కింగ్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇకపోతే పవర్ స్టీరింగ్ కూడా ఉంది. 5 మంది కూర్చొవచ్చు.35 లీటర్ల ఇంధనం పడుతుంది.