విచారణ కోసం తీసుకెళ్లి.. భర్త ఉండగానే రేప్ చేసిన కానిస్టేబుల్.. చివరికి..?

praveen
ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నా  అన్న విషయం తెలిసిందే. కామాంధుల బారిన పడకుండా ఉండేందుకు మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కామాంధుల కోరల్లో చిక్కుకొక  తప్పడంలేదు.  ఈ నేపథ్యంలో రోజురోజుకు మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.అయితే ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు సైతం కొంతమంది అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు అందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి.

 ఇటీవలే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది పంజాబ్లో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా ఒక మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ ఘటన పంజాబ్లోని లూధియానాలో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయంపై బాధితురాలు ఉన్నత అధికారులకు లేఖ రాసింది.  తన భర్త స్నేహితుడు తరచూ తన ఇంటికి వచ్చేవాడని ఈ క్రమంలోనే తన బంధువులు మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించి.. ఓసారి మూకుమ్మడిగా తనపై దాడి చేసి చితకబాదారు అని..  బట్టలు చింపి వీడియో తీశారు అంటూ లేఖలో తన బాధను వెలిబుచ్చింది బాధితురాలు.

 దాడులకు బాధపడి.. సొంత ఇంటిని వదిలి బంధువుల ఇంటికి వెళ్లగా.. అక్కడికి చేరుకుని వారు హెడ్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్ కి ఫోన్ చేయడంతో అతడు కూడా మహిళా పోలీసులు లేకుండానే నా భర్తతో పాటు తనను  కూడా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి .. భర్తతో పాటు తనపై కూడా దారుణంగా దాడి చేసి విచారణ కోసమని మొదటి అంతస్తు లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు అనే విషయాన్ని లేఖలో పేర్కొంది బాధితులు. దీని గురించి బయట ప్రపంచానికి తెలియ చేయాలని ఉద్దేశంతోనే లేఖ రాస్తున్నాను అంటూ ఉన్నతాధికారులకు లేఖ రాసింది బాధితురాలు.  ఈ క్రమంలోనే వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: