చైనా ప్లాన్.. కేసిఆర్కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.. ఏం జరిగిందంటే.?
ఇప్పటికే వివిధ యాప్స్ రూపం లో భారతీయ బిజినెస్ దెబ్బ తీయడంతో పాటు ఇక డేటా చోరీ కి పాల్పడిన చైనా... ఏదో ఒక రూపంలో భారతీయుల సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాలలో కాల్ మనీ యాప్ ద్వారా 21 వేల కోట్ల రూపాయలు చైనా కు తరలించినట్లు నిజం బయట పడింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ కేసులో చైనాకు చెందిన కీలకమైన నిందితుడు.. ల్యాంబో కాల్ సెంటర్ ఆపరేటర్ నాగరాజు లను కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే వీరిని విచారిస్తున్న తరుణంలో కీలకమైన నిందితుడు అయినటువంటి ల్యాంబో అసలు తనకు చైనీస్ లాంగ్వేజ్ తప్ప ఇంగ్లీషు రాదని.. పోలీసుల దగ్గర నాటకం ఆడుతున్నాడట. అయితే దీనిపై విశ్లేషకులు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ రాకుండానే ఇన్నిరోజులు కార్యకలాపాలు నిర్వహించాడా అని అంటున్నారు. ప్రస్తుతం కేసు నుంచి తప్పించుకోవడానికి నిందితుడు ఈ నాటకాలు ఆడుతున్నాడని ఉంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు కాస్త కెసిఆర్ కు తలనొప్పిగా మారిందని అంటున్నారు విశ్లేషకులు.