బాబోయ్: పవన్ మైండ్ గేమ్ మామూలుగా లేదుగా!
ఆ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పవన్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేయలేదు. అప్పుడప్పుడు ఎంట్రీ ఇచ్చి, చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇక 2017లో ఏ పార్టీతో పొత్తు లేదని చెప్పి బయటకొచ్చి, బీజేపీ, టీడీపీలని తెగ తిట్టారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బిఎస్పిలతో కలిసి పోటీ చేసి, అప్పటి టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చి వైసీపీని దెబ్బ కొట్టి, మళ్ళీ చంద్రబాబుకు లబ్ది చేద్దామని చూశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. జగన్ భారీగా సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చారు.
జగన్ అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక పవన్ సైతం మునుపటిలానే అప్పుడప్పుడు బయటకొచ్చి జగన్ ప్రభుత్వాన్ని తిడుతూ చంద్రబాబుకు లబ్ది చేకూరేలా నడుచుకుంటున్నట్లు కనిపిస్తోంది. బీజేపీతో పొత్తులో ఉంటూనే, టీడీపీకి ఫేవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా తాజాగా కృష్ణా జిల్లాలో పవన్, నారా లోకేష్‌లు ఒక్కసారే పర్యటించి, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు.
పైగా పవన్ అప్పటివరకూ సినిమా షూటింగుల్లో ఉండి, ఒక్కసారిగా వచ్చి జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఇద్దరు మంత్రులు చంద్రబాబుపై ఎప్పుడు ఫైర్ అవుతారు. కానీ పవన్‌పై పెద్దగా విమర్శలు చేయలేదు. అయితే వీరినే పవన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అంటే దీని బట్టి చూసుకుంటే పవన్ మైండ్ గేమ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. బాబుని సేవ్ చేయడానికే పవన్ ఉన్నారని ఫైర్ అవుతున్నారు.