దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ఎప్పటినుండో తెలుసా.. అందరూ తెలుసుకోవాల్సిన విషయం..?
ఈ క్రమంలోనే వచ్చే సంవత్సరంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది అయితే వచ్చే సంవత్సరంలో వ్యాక్సిన్ వస్తుంది అని తెలిసినప్పటికీ ఏ సమయంలో వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాక్సిన్ లకు భారత్ అనుమతి ఇస్తున్న నేపథ్యంలో మొదట ఏ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అనే దానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రోజెనిక వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే భారత్లో ఎప్పుడు వ్యాక్సిన్ ప్రారంభం అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం పై.. కేంద్ర కమిటీ ఇటీవలే మరింత సమాచారాన్ని కోరినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ నిరోధకత సహా మరిన్ని అంశాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర కమిటీ కోరిందట. ఇక ఈ అంశాలు అన్నింటిని కేంద్రకమిటీ పరిశీలించిన తర్వాత జనవరి నెలలో వ్యాక్సిన్ భారత్ లో అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.