నిమ్మగడ్డ రమేష్ కు స్ట్రెయిన్ స్ట్రోక్. చెప్తే వింటాడా..?

P.Nishanth Kumar
టీడీపీ, బీజేపీ లాంటి పెద్ద పెద్ద పార్టీ లలోని నాయకులే వైసీపీ ని, జగన్ ని పెద్దగా మాటలనలేకపోతున్నారు.. అలాంటిది ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగడ్డ రమేష్ అధికారంలో ఉన్న మాటను ఏమాత్రం లెక్కచేయకపోవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి గా మారిపోయింది.. రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా తయారైన నిమ్మగడ్డ రమేష్ ఆ మధ్య సుప్రీం కోర్టు కి వెళ్లి మొట్టికాయలు తిన్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం పై కోర్టు కెక్కి కాలయాపన చేసి ప్రభుత్వం టైం ని వేస్ట్ చేసిన నిమ్మగడ్డ కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దని పట్టుపట్టి మరీ ప్రభుత్వాన్ని ఎదురించి కోర్టులో కేసు వేసి చేతులు కాల్చుకున్నాడు..

ఎన్నికల కోడ్ తొలగించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించి ముందుకెళ్లాలని ఆదేశాలు కూడా అందుకున్నారు. అయినా ఇప్పుడు ఆయన కోర్టు ధిక్కారణకు పూనుకున్నట్టు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.. ప్రతిపక్షాల అండతో  స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తున్నారు. కరోనా ఇంకా తగ్గలేదని ఎంత మొత్తుకుంటున్నా నిమ్మగడ్డ తన స్వలాభం కోసం వైసీపీ పార్టీ  ని ఓడించాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అపాయింటి చేసిన నిమ్మగడ్డ టీడీపీ గెలవడానికి టీడీపీ నేతలకన్నా ఎక్కువగా కష్టపడుతున్నారు.

న పదవీకాలంలో ఒక్క సారి అయినా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న నిమ్మగడ్డ ఇప్పటి వరకూ.. తన రాజ్యాంగ అధికారాలను వీలైనంతగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆయనకు అన్నీ కలసి వస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా కరోనా స్ట్రెయిన్ వైరస్ ఏపీలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జాగ్రత్తగా ఉండాలని…ఆదేశించింది. కొన్నిరకాల ఆంక్షలు విధించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. దీంతో ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించకుండా.. కొత్త ఆయుధం దొరికినట్లయింది. నిమ్మగడ్డతో జరిపే చర్చల్లో ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: