ఆ బీజేపీ నేతకు జగన్ అంటే అంత కోపం ఎందుకో? అసలు వ్యూహం అదేనా?

M N Amaleswara rao
గత కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ నేతలంతా జగన్‌ని విమర్శించరు. కొందరు మాత్రమే ప్రతిపక్ష టీడీపీ నేతల మాదిరిగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు, ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ జైలుకు వెళ్తారని, త్వరలో రాష్ట్రానికి కొత్త సీఎం వస్తారని, మరో మూడేళ్ళలో జగన్ అధికారంలో ఉండరని మాట్లాడుతూనే ఉన్నారు.

తాజాగా కూడా విష్ణు ఇలాంటి రకమైన వ్యాఖ్యలే చేశారు. జగన్ ఎన్నికలకు ముందు దొంగ ప్రేమ చూపించారని, 31 కేసులు, 11 సీబీఐ, 5 ఈడీ కేసులున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరన్నారు. prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ మీద కూడా ఇన్ని లేవని చెప్పుకొచ్చారు. కోర్టులు వెంటనే తీర్పు నిచ్చే పరిస్థితి లేనందునే జగన్ సీఎంగా ఉన్నాడన్నారు. ఒక్క తీర్పు వస్తే జగన్ ఉండాల్సిన స్థానం జైలే అని, బెయిల్‌పై ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది జగన్ ఒక్కడే అని విమర్శించారు.

అయితే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఈ స్థాయిలో జగన్‌పై విమర్శలు చేయరు. కానీ విష్ణు మాత్రం జగన్‌పై ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. విష్ణు ఇలా మాట్లాడటానికి కారణాలు లేకపోలేదు. విష్ణు పక్కాగా టీడీపీ లైన్‌లోనే మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే విష్ణు ఏదొక సమయంలో టీడీపీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు. మొన్న ఎన్నికల సమయంలోనే విష్ణు టీడీపీలోకి వెళ్ళి విశాఖ నార్త్ సీటులో పోటీ చేయాలని చూశారు. కానీ అక్కడ గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేయడంతో, విష్ణు బీజేపీలోనే పోటీ చేసి ఓడిపోయారు. అయితే నెక్స్ట్ గంటా టీడీపీని వీడితే విష్ణు ఆ పార్టీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే జగన్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: