లోకేష్ ఓదార్పు యాత్ర ?

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పార్టీ నాయకులలో ఉత్సాహం పెంచేందుకు ఎప్పటికప్పుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా,  పార్టీలో అనుకున్నంత స్థాయిలో ఉత్సాహం కనిపించడం లేదు. 70 ఏళ్ల వయసు దాటినా, చంద్రబాబు ఏపీలో పార్టీ నాయకులో ఉత్సాహం కలిగిస్తూ,  ప్రజలలో బలం పెంచుకునేందుకు... వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లోకేష్ మాత్రం ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అయి పోతున్నారు.



 ఏపీలో అడుగుపెట్టేందుకు ఇష్టపడటం లేదు. ఏదైనా సోషల్ మీడియా ద్వారానే కామెంట్స్ చేస్తూ పార్టీలో తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. కాకపోతే రానున్న రోజుల్లో టిడిపి పగ్గాలు లోకేష్ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో, ఆయనను ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ఏపీలో తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవడం తో వారందర్నీ పరామర్శించేందుకు 7జిల్లాల్లో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల్లో ఉత్సాహం ఎక్కువగా కనిపించింది . అయితే ఆ తర్వాత ఎక్కడ లోకేష్ హడావుడి కనిపించకపోవడంపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.



 ఇప్పుడు మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు లోకేష్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల ఆత్మహత్య పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు లోకేష్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఓదార్పు తో
 పాటు, ఆయా జిల్లాల కలెక్టరేట్ ల వద్ద లోకేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు టిడిపి సిద్ధమవుతోంది. ఈ విధంగా పార్టీ నాయకులలోనూ పట్టు పెంచుకోవాలనే విధంగా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: