ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఉచితంగా నీట్, జేఈఈ శిక్షణ..?

praveen
ప్రస్తుతం ఎంతోమంది పేద విద్యార్థులకు పెద్దపెద్ద చదువులు చదవడం ఎంతో భారంగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత వివిధ కోర్సుల్లో చేరడానికి ఒక ప్రత్యేక శిక్షణ తీసుకొని పోటీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కానీ ఎంతో మంది విద్యార్థులు తమ ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇక చివరికి నిరాశతో వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ  కొన్ని పోటీ పరీక్షల కోసం సిద్ధం చేసేందుకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అటు డిగ్రీ పూర్తిచేసిన వెంటనే వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించేందుకు కూడా ముందుకు వస్తున్నాయి.




 తద్వారా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎంతో మంది విద్యార్థులకు ఆయా స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతగానో తోడ్పాటును అందిస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాబోధన చేసేందుకు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకా పూర్తి స్థాయిలో విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అదే సమయంలో ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.


 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో  ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అందరికీ ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా నీట్ జేఈఈ పరీక్షలకు సంబంధించిన ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దక్షిణ ఇండియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముందుకు వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ కుమార్ తెలిపారు. దీనివల్ల దాదాపుగా పది వేల మంది విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మెరిట్ విద్యార్థులకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: