
ఉద్యోగం పోయి.. కోటీశ్వరుడైన భారతీయుడు..?
అయినా ఉద్యోగం వదిలేయగానే కోటీశ్వరుడు గా మారి పోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ఇదంతా లాటరి మహత్యం. ఈ మధ్యకాలంలో లాటరీల ద్వారా కేవలం ఓవర్ నైట్ లో లక్షాధికారులు గా మారిపోతున్న వారు కొంతమంది అయితే ఇక ఇంకా ఎక్కువ అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరులు గా మారిపోతున్నారు మరికొంతమంది. ఇక ఇలా బాగా అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళలో మనం మాట్లాడుకునే వ్యక్తి కూడా ఒకరు. అబుదాబి లో ఉంటున్న 30 ఏళ్ల భారతీయ నిరుద్యోగిని అదృష్టం వరించింది. కరోనా వైరస్ కారణంగా ఉన్న ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. దీంతో ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు సదరు ఉద్యోగి.
ఈ క్రమంలోనే ఓ లాటరీ డ్రా విజేతగా నిలిచిన సదరు భారతీయ నిరుద్యోగి 7.40 కోట్లు గెలుచుకున్నాడు. కేరళకు చెందిన నవనీత్ లాటరీ మొత్తాన్ని గెలుచుకున్నాడు అని ఇటీవలే లాటరి సంస్థ ప్రకటించింది. నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటూ ఉపాధి చూసుకున్న నవనీత్ ఇటీవలే కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయాడు ఈ క్రమంలోనే గత నెల 22వ తేదీన లాటరీ కొనుగోలు చేయగా అదృష్టం వరించింది. ఏకంగా కోటీశ్వరుడు గా మారిపోయాడు . ఇక ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నవనీత్ కి కోట్ల రూపాయల లాటరీ రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.