బీజేపీ రూటే సెపరేటు ! వైసీపీ టీడీపీ లకు పొగ పెట్టేస్తోందిగా ?
అయితే టీడీపీకి రాయలసీమలో ఉన్న కాస్తో కూస్తో పట్టు కూడా ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయింది. పూర్తిగా ఆ పార్టీ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంపైనే దృష్టి పెట్టింది. ఈ ప్రాంతంలో బాబు సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో, ఎప్పటికైనా వారు తమను ఆదరిస్తారని బాబు డిసైడ్ అయిపోయారు. 2014 ఎన్నికల్లోనూ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనే టీడీపీకి ఎక్కువ సీట్లు లభించాయి. బీజేపీకి గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో కాస్త పట్టు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అటు టిడిపి ఇటు వైసీపీలను దెబ్బ తీయాలంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భాగా బలపడాలని బిజెపి ఒక అభిప్రాయానికి వచ్చేసింది.
అందుకే ముందుగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో సత్తా చాటు కోవడం ద్వారా, రాయలసీమలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. దీని కోసం హిందూ కార్డు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది. దాని ద్వారానే జగన్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గంలో చీలిక తీసుకువచ్చి, వైసిపి బలం తగ్గించి బిజెపి బలపడాలని చూస్తోంది. గోదావరి జిల్లాల్లో కాపులను, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీలను, టిడిపి వైసిపి లకు దూరం చేయడం ద్వారా, ఆ స్థానాన్ని ఆక్రమించాలి అనే లక్ష్యంతో బిజెపి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలనే విషయంపై బీజేపీ దృష్టి పెట్టింది. నియోజకవర్గ స్థాయి నాయకులను , మండలస్థాయి నాయకులను బిజెపిలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తుంది. బిజెపి దూకుడుతో ముందు ముందు వైసిపి టిడిపి లో కాస్త ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.