మరణించిన తల్లి.. చివరి కోరిక తీర్చడం కోసం కూతుర్లు ఎలాంటి పని చేసారో తెలుసా.?

praveen
ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇక తల్లిదండ్రుల పేరుమీద ఉన్న ఆస్తి కోసం వారి కడుపున పుట్టిన వారు గొడవకు దిగడం లాంటి ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి. అంతే కాకుండా ఏకంగా ఆస్తి మాకు అంటే మాకు కావాలి అంటూ ఏకంగా కోర్టులకు కూడా వెళుతున్నారు ఎంతోమంది.  ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆస్తి మాకే దక్కాలి అంటూ ఇక ఎన్నో రోజుల పాటు భారీగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అటు కోర్టులకు తిరగటం లాంటివి చేస్తూ గొడవలు పడుతూ ఉన్న  ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.  ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఏకంగా కోట్ల ఆస్తిని వదులుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 తల్లిదండ్రులు మరణించిన తర్వాత కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు వదులుకోవడం ఏంటి అని ఎవరైనా వదులుకుంటారా అలాంటిది కుదరనే కుదరదు అని తెగేసి చెప్పేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా తన తల్లి మరణించిన తర్వాత తన తల్లి చివరి కోరిక తీర్చడానికి ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని వదులుకున్నారు ఇక్కడ ముగ్గురు కుమార్తెలు.  కుమార్తెలు చేసిన పనికి అందరూ ఏకంగా ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అని ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒడిశాలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.


 ఒడిషా లోని నవరంగపూర్ కు చెందిన ఓ మహిళ ఇటీవల అనారోగ్యంతో మరణించింది ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉండగా.. ముగ్గురు కూతుర్లకు కూడా పెళ్లయి ప్రస్తుతం పిల్లలు ఉన్నారు. అయితే ఈ ముగ్గురు కూతుర్లుకు  కూడా తల్లి వారసత్వంగా వచ్చిన ఒక మూడు అంతస్తుల భవనం ఉంది. ఇక దీని విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుంది. కాగా కోటి రూపాయల విలువ చేసే ఈ భవనాన్ని ఏకంగా ఆలయానికి విరాళంగా ఇచ్చేశారు ముగ్గురు కూతుర్లు. ఎందుకు అని ప్రశ్నిస్తే తమ తల్లి చివరి కోరిక ఇదే అంటూ చెబుతున్నారు. ఇలా తల్లిదండ్రులు ఆస్తులకోసం గొడవలకు దిగుతున్న రోజుల్లో ఏకంగా తల్లి మరణించిన తర్వాత కూడా తల్లి చివరి కోరిక తీర్చాలని కోట్ల విలువ చేసే ఆస్తిని ఆలయానికి విరాళంగా ఇవ్వడం తో ఎంతో మంది వీరిని ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: