ఊహించని చిచ్చు పెట్టిన బాబు...ఎవరికి ఉపయోగం?
జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి జగన్‌ని ఏదొరకంగా ఇబ్బంది పెట్టాలనే బాబు ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగానే ముందుకెళుతున్నారు. ఎలాగైనా జగన్ స్పీడుకు అడ్డుకట్ట వేయాలని అనుకుంటున్నారు. అందుకే తెల్లారి లేగిస్తే చాలు జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన అమలు చేసే పథకాలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ చేసే ప్రతి కార్యక్రమాన్ని కోర్టుకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ అమలు చేయాలని అనుకుంటున్న మూడు రాజధానుల ఏర్పాటుని అడ్డుకోవాలని చూస్తున్నారు. అమరావతిని శాసనరాజధానిగా ఉంచి, రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన కూడా బాబు, ఏదొరకంగా దీనిపై రాజకీయం చేస్తూ పబ్బం గడపాలని చూస్తున్నారు. ఇక బాబు ఆడే రాజకీయ క్రీడలో అమరావతి రైతులు బలైపోతున్నారనే కామెంట్లు కూడా వస్తున్నాయి.
అయితే అమరావతి రైతుల విషయంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బాబు చిచ్చు పెట్టినట్లే కనిపిస్తోంది. ఇటీవల అమరావతి ఉద్యమం సంవత్సరం అయిన సందర్భంగా చంద్రబాబు, అమరావతి ప్రాంతానికి వెళ్ళి రైతులకు మద్ధతు ఇచ్చారు. ఇక అక్కడ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి చిచ్చు పెట్టారు. ఎప్పుడు లేని విధంగా బాబు, తీవ్ర పదజాలంతో జగన్‌పై విమర్శలు చేశారు. బాబు ఇలా చేయడంతో మూడు రాజధానుల్లో భాగమైన విశాఖ, కర్నూలు ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీని వల్ల రాష్ట్రంలో ప్రజల మధ్య లో చిచ్చు పెట్టినట్లు అయింది.