ఆవుపేడతో పెయింట్ ! త్వరలోనే మార్కెట్ లోకి ?

ఆవు పేడతో పిడకలు చేసుకోవడం ,ఇల్లు అలకడం వంటివి మాత్రమే మనకు తెలుసు. కానీ ఏకంగా ఆవు పేడతో పెయింట్ ని తయారు అయిపొయింది. ఈ పెయింట్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయాన్ని చెప్పింది ఆషామాషీ వ్యక్తులు అయితే కాదు. స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా వేదికగా దీనిని ప్రకటించారు. వేదిక్ పేరుతో రూపొందించిన ఈ పెయింట్ లో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ పెయింట్ ఇళ్లకు వేసుకోవడం ద్వారా, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, రైతులకు ఆదాయం పెరుగుతుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ పెయింట్ తయారవుతోందని, వీటి ద్వారా పాడి రైతులు ఏడాదికి 55,000 సంపాదిస్తారు అంటూ పేర్కొన్నారు. 


ఇక ఈ పెయింట్ గురించి చెప్పుకుంటే, డిస్టెంబర్, ఎమల్షన్ రకాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ పెయింట్ వేసిన నాలుగు గంటల్లోనే అది ఆరిపోతుంది. పూర్తిగా పర్యావరణ రహితమైన ఈ పెయింట్ ద్వారా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుందని, చెప్పుకోవడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా, ఈ పేడ పెయింట్ కుమారప్ప నేషనల్ అండ్ మేడ్ పేపర్ ఇన్స్టిట్యూట్ గత కొన్నేళ్లుగా రూపొందిస్తుందని గడ్కరీ తెలిపారు. ఇప్పటికే బిజెపి ప్రభుత్వం గోసంరక్షణ పేరుతో ఎన్నో రకాలుగా వాటిని పెంచి పోషించే వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వస్తోంది. 



ఇప్పుడు పర్యావరణ హితమైన ఈ పేడ పెయింట్ ను ప్రమోట్ చేస్తోంది. ఇటీవల ఎక్కువగా పర్యావరణ హితమైన వస్తువులను వాడేందుకు జనాలు మొగ్గు చూపుతున్న తరుణంలో, ఈ వేదిక్ పెయింట్ ఆదరణ పొందే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: